రౌడీ బేబీ.. రచ్చ..రచ్చ..

280

ధనుష్-సాయిపల్లవి బ్లాక్ బస్టర్ హిట్ మారీ2. మారీ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ గా మారీ2 తెరకెక్కించారు. ఇటీవలే రిలీజైన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ కాగా, తెలుగులోనూ తన ప్రత్యేకతను చాటింది. ముఖ్యంగా ఈ మూవీలోని సాంగ్స్ కు మంచి ఆదరణ దక్కింది. ధనుష్-సాయిపల్లవి ఈ సినిమాలో చేసిన డ్యాన్సులు కుర్రకారుని ఉర్రూతలూగించాయి. తాజా ఈ సినిమాలోని రౌడీ బేబీ వీడియో సాంగ్ ను అధికారికంగా రిలీజ్ చేశారు. హీరోగా నటించిన ధనుష్ స్వయంగా పాడినపాటకు, సాయిపల్లవి, ధనుష్ డ్యాన్సులు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇదే ఆ సాంగ్.