లాటరీ పేరుతో కుచ్చుటోపీ

1831

దుత్తలూరు, సెప్టెంబర్-7: రూ.5 కోట్ల లాటరీ తగిలిందని మోసానికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. దుత్తలూరుకు చెందిన ఖాదర్ బాషాకు రూ.5కోట్లు లాటరీ తగిలిదంటూ కొందరు వ్యక్తులు కాల్ చేశారు. అయితే డబ్బు డ్రా చేయడానికి కొంత మొత్తం కట్టాలంటూ ఖాదర్ బాషా నుంచి రూ.4.25 లక్షల మేర వసూలు చేశారు. కాగా మరో రూ.4 లక్షలు ఇవ్వాలని అడగడంతో అనుమానం వచ్చిన ఖాదర్ బాషా దుత్తలూరు సీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో అసలు వ్యవహారం బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.