వస్తే కాదనం..

2079

బీజేపీ నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నెల్లూరు జిల్లా జడ్పీ చైర్మన్, వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి. నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఇప్పటికే ప్రచారంలో ఉన్న బొమ్మిరెడ్డి వెంకటగిరిలో పార్టీ పరంగా జరిగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక శక్తులన్నిటినీ ఏకతాటిపైకి తెస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికలనాటికి పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సైతం పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు. టీడీపీకి బీజేపీ మిత్రపక్షమే అయినా స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను ఇటీవల తీవ్రంగా విమర్శించారు రామ్ కుమార్ రెడ్డి. ఈ దశలో బొమ్మిరెడ్డి వ్యాఖ్యలు వెంకటగిరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.