వాటా తప్పింది.. వేటు పడింది

1011

కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏఎస్సై సుబ్రహ్మణ్యంను జిల్లా ఎస్పీ వీఆర్ కు పంపించారు. మద్యం మత్తులో పోలీస్ స్టేషన్లో తోటి సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన కారణంగా సుబ్రహ్మణ్యంపై వేటుపడినట్టు తెలుస్తోంది. ఓ ఫ్యాన్సీ స్టోర్‌ వివాదంలో.. సీఐ, ఏఎస్ ఐల మధ్య పంపకాలు దగ్గర తేడా వచ్చి.. పోలీస్‌స్టేషన్‌లోనే గొడవపడినట్టు సమాచారం. సోమవారం రాత్రి ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం స్టేషన్‌లో.. సీఐ రోశయ్యతో వాగ్వాదానికి దిగడంతో.. అక్కడే ఉన్న ఎస్ ఐ అంకమ్మ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఎస్ ఐని సుబ్రహ్మణ్యం నెట్టాడు.. దీంతో ఆగ్రహం చెందిన సీఐ దీనిపై పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏఎస్సైని వీఆర్ కు పంపించారు.