వాస్తవాలు తెలుసుకోడానికే ఎస్పీని కలిశాం..?

1759

క్రికెట్ బెట్టింగ్ లకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోడానికే జిల్లా ఎస్పీని కలిశామని వివరణ ఇచ్చారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. దీనిపై టీడీపీ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. అవినీతి అధికారుల్ని కావాలనే జిల్లాకు బదిలీ చేయించుకుని వారి దగ్గర మామూళ్లు వసూలు చేసుకుంది టీడీపీ నేతలేనని ఆరోపించారు. జిల్లాలో బయటపడుతున్న ప్రతి కుంభకోణంలోనూ అధికార పార్టీ నేతల పాత్ర ఉందని అన్నారు కాకాణి.