విద్యార్థి కాలికి సివిల్ బేడీలు

2343

అతనొక  విద్యార్ది. సెలవలు నిమిత్తం ఊరుకొచ్చాడు. ఊళ్ళో నాన్న, పెదనాన్న మద్య ఆస్తి గొడవలు. పంచాయితీ స్టేషన్కు చేరింది. అయితే అత్యుత్సాహం చూపించిన పోలీసులు, చదువుకుంటున్న విజ్జేష్ రెడ్డిని పిలిపించి స్టేషన్లో కూర్చోని పెట్టారు. కానీ చదువుకుంటున్న విజ్జేష్ రెడ్డిని సాదాసీదాగా కూర్చోపెట్టలేదు.. హత్యకేసులోనో లేక మానభంగం కేసులోనో పట్టుకొచ్చిన నిందుతుడిని, తప్పించుకుపోకుండా ఉండేవిదంగా కాళ్లకు బేడీలు వేసి బందించారు గూడురు వన్ టౌన్ పోలీసులు. చివరకు పెద్దల సహాయంతో కొడుకును బయటకు తీసుకొచ్చారు అతని తల్లిదండ్రులు. అయితే తీవ్ర మనస్థాపానికి గురైన విజ్ఝేష్ రెడ్డి, తనకు పోలీసులు ఎందుకు బేడీలు వేసి అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు. రేపు సమాజ్యంలో నేను ఏ విదంగా తలెత్తుకోని బ్రతకాలి అని ప్రశ్నిస్తున్నాడు.