విధి వంచిత..

681

బిడ్డకు ఆయువు పోసిన ఐదురోజుల్లోపే ఆ తల్లిగుండె ఆగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆ బాలింత మృతిచెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని కావలి ఏరియా ఆస్పత్రిలో ఈ దారుణం జరిగింది. మరో విషాదం ఏంటంటే ఆ పిచ్చితల్లికి తనను తల్లిని చేసిందెవరో తెలీదు. చెప్పేందుకు నోరు లేదు. మానవత్వానికే మచ్చ తెచ్చే ఈ ఘటన హృదయ విదారకంగా ఉంది.