విధులకు వెళ్తూ విధికి బలయ్యాడు..

1180

ఉదయాన్నే విధులకు బయలుదేరిన ఓ హిందీ ఉపాధ్యాయుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఆయన ఓజిలి మండలం గ్రద్ధగుంట పాఠశాలలో హిందీ పండిట్ గా పనిచేస్తున్నాడు. శ్రీకాళహస్తి నుంచి నాయుడుపేటకు ఆటోలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లకూరు మండలం కొత్తూరు దగ్గర నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారిపై ఆటోను-కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.