వీఆర్వోలను బలిపశువుల్ని చేస్తారా..?

492

నెల్లూరు జిల్లాలో జరిగిన పసుపు కుంభకోణంలో సూత్రధారుల్ని, పాత్రధారుల్ని తప్పించి కేవలం వీఆర్వోలను బలిచేశారని అన్నారు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఈ కుంభకోణంపై నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతల పాత్ర ఉందని తేలినా వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. పసుపు పంట కొనుగోళ్లలో జరిగిన భారీ స్కామ్ లో కలెక్టర్ నుంచి తాము ఆశించింది వేరని, ఆయన చేస్తోంది వేరని అన్నారు కాకాణి.