వెంకటగిరిలో ఎర్ర ముఠా అరెస్ట్..

177

వెంకటగిరి పట్టణంలోని, రాపూరు క్రాస్ రోడ్స్ దగ్గర ఎర్రచందనం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల సమాచారంతో వెంకటగిరి ఎస్.ఐ. కొండప్పనాయుడు నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. బంగారుపేట సమీపంలోని, రాపూరు క్రాస్ దగ్గర టాటా విస్తా కారులో అక్రమంగా తరలిస్తున్న 313 కేజీల 13 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎర్రచందనం అక్రమ రవాణాలో నలుగురు ముద్దాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాటా విస్టా కారు, హీరోహోండా CD డీలక్స్ బైక్, 14 సెల్ ఫోన్లు, 3000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.