వెంకటగిరిలో భారీ వర్షాలు..

352

భారీ వర్షాలకు వెంకటగిరిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్టీఆర్ కాలనీ, మల్లమ్మగుడి సమీపంలో ఇళ్లలోకి నీరు చేరుకుంది. రోడ్డు సైతం మునిగిపోయింది. పలుచోట్ల మగ్గం గుంతల్లోకి నీరు చేరడంతో చేనేత కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. దీనిపై స్పందించిన మున్సిపల్ చైర్ పర్సన్ దొంతు శారద మునక ప్రాంతాల్లో పర్యటించి నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు.