వెంటాడిన మృత్యువు..

759

వాహనం తీసుకుని రోడ్డెక్కితే ప్రాణాలతో ఇంటికి తిరిగి వెళ్తారో లేదో తెలియని పరిస్థితి. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లా కావలి మండలం చింతలపాలెం క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం ఓ యువకుడిని బలితీసుకుంది. లారీ బైకుని ఢీకొన్న ఘటనలో మహేష్ (20) అక్కడికక్కడే మృతిచెందగా ఆంజనేయులు అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు మహేష్, గాయపడిన ఆంజనేయులు ఇద్దరూ కొండాపురం మండలం సాయి పేటకు చెందిన వారిగా గుర్తించారు.

2 3