వైభవంగా వెంగమాంబ బ్రహ్మోత్సవాలు

716

ఉదయగిరి, జూన్-28: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో వెలసిన వెంగమాంబ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడోరోజు స్నపనోత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. స్నపనోత్సవం సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు పులివర్తి వెంగయ్య అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపు వైభవంగా జరిగింది.