వ్యాపారం కోసం రాజకీయమా..?

1708

బీజేపీ నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ప్రజల్లో పలుకుబడి లేదని విమర్శించారు వెంటగరిగి టీడీపీ నేతలు. ఆయనెప్పుడూ జనంలో తిరిగిన మనిషి కాదు, వ్యాపారాలకోసం స్వార్థ రాజకీయాలు చేస్తుంటారు. ఆయనకు అభివృద్ధిమీద అంత శ్రద్ధ ఉంటే మిత్రపక్షంగా ఎమ్మెల్యేతో కలసి పనిచేయాలి. వెంకటగిరి ఎమ్మెల్యే అధికారులమీద గౌరవంతో ఉండేవారు, ఆటో డ్రైవర్లు, గ్రామాల్లో ట్రాక్టర్ డ్రైవర్లు.. ఇబ్బంది పడుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోయారు తప్ప, అనేక సందర్భాల్లో ఎస్పీ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. రామ్ కుమార్ రెడ్డి వారి కుటుంబ గొడవల్లో పోలీసులను మంచి చేసుకోవాలనే ప్రయత్నంలో ఎమ్మెల్యేని విమర్శించడం మంచిది కాదని అన్నారు. వెంకటగిరి R&B గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎంసీ చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు, జిల్లా తెలుగు యువత నాయకులు కేవీకే ప్రసాద్, టీడీపీ నేతలు మంకు ఆనంద్, పొనుగోటి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.