నమ్మశక్యంకాని శునక తీర్ధ యాత్ర …

1969

ఓ వీధి కుక్క శ‌బ‌రిమ‌లై యాత్ర క‌ర్ణాట‌క లో చ‌ర్చ‌నీయాంశం అయింది. అది పెంపుడు కుక్క కాదు వీధి కుక్క, కాశీ మ‌జిలీ క‌థ‌ల్లాగా  ఈ కుక్క శ‌బ‌రిమై యాత్ర విచిత్ర‌మైన‌దే కాదు విశేష‌మైన‌ది కూడా, క‌ర్ణాట‌క‌లోని అల‌సూర్  నుంచి 16 మంది అయ్య‌ప్ప భ‌క్తులు కాలిన‌డ‌క‌న గ‌త నెల 17వ తేదీన‌ శ‌బ‌రిమ‌లైకు బ‌య‌లు దేరారు. వారితో పాటే ఓ కుక్క కూడా వారిని అనుస‌రించింది. మైళ్ల‌కు మైళ్ళు ఆ కుక్క త‌న‌తోనే వ‌స్తున్న‌డంతో దానికి బైర‌వ అని పేరు పెట్టారు. ఈ ప్ర‌యాణంలో మ‌ద‌న్ కుమార్ అనే భ‌క్తుడు ఈకుక్క యోగ‌క్షేమాలు చూస్తూనే ఉండేవాడు. దిండిగ‌ల్ వ‌ద్ద మ‌ద‌న్ కుమార్ ను ఓ కారు ఢీకొంది. యాత్రికులు కొంత మంది దిండిగ‌ల్ ఆస్ప‌త్రిలో మ‌ద‌న్ కూమార్ ను చేరిపించి అత‌నితో నే ఉండిపోయారు. కుక్క కూడా మ‌ద‌న్ కుమార్ తోనే ఆస్ప‌త్రిలో ఉండిపోయింది. మ‌ద‌న్ కుమార్ రెండురోజుల త‌రువాత చ‌నిపోవ‌డంతో ఆయ‌న శ‌వాన్ని అంబులెన్స్ లో వెన‌క్కి తీసుకెళ్ళిపోయారు. శ‌బ‌రిమ‌లై పోతున్న మ‌రో బృందం అప్ప‌టికి 60 కిలోమీట‌ర్లు ముందుకు వెళ్ళిపోయింది. రెండు రోజుల త‌రువాత విచిత్రంగా ఈ కుక్క దిండిగ‌ల్ నుంచి యాత్ర కొన‌సాగిస్తున్న బృందానికి చేరుకుంది. దీంతో అయ‌ప్ప భ‌క్తులు ఆశ్చ‌ర్య‌పోయారు, ఆ కుక్క త‌మ‌ను ఎలా చేరుకుందో తెలియ‌ని అయోమ‌య పరిస్థితిలో ప‌డ్డారు. ఇదంతా అయ్య‌ప్ప మ‌హిమ‌మే అని భావించి, ఆ కుక్క‌ను జాగ్ర‌త్త‌గా పంబ‌ న‌ది వ‌ర‌కు తీసుకెళ్ళారు. పంబ నుంచి భ‌క్తులకంటే ముందుగా ఆ కుక్క శ‌బ‌రిమ‌లైకు చేరుకుని వీరికోసం ఎదురుచూస్తుంది. ఈ విషాన్ని ఆల‌య అధికారుల‌కు చెప్పి కుక్క‌ను కూడా త‌మ వెంట స్వామి వారి ద‌ర్శ‌నానికి తీసుకుపోయారు. ఆల‌య క‌మిటీ ఈ విష‌యం విని కుక్కను ఇక్క‌డే వ‌దిలి వెళ్ళిపోవాలిని దాని బాగోగులు మేమే చూసుకుంటామ‌ని ఆల‌య క‌మిటీ చెప్పారు. యాత్రికుల బృందం అందుకు అంగీక‌రించి ఆ కుక్క‌ను అక్క‌డే వ‌దిలేసి వెనక్కి తిరిగి వ‌చ్చేశారు. విచిత్రం ఎమిటంటే పంబ వ‌ద్ద యాత్రికుల బృందం ఎర్ణాకులం బ‌స్సు ఎక్కుతుండ‌గా వారికంటే ముందే కుక్క అక్క‌డ‌కు చేరుకుంది, దాంతో యాత్రికులంతా ఒక  నిర్ణ‌యానికి వ‌చ్చి కుక్క‌ను త‌మ‌తోనే తీసుకు వ‌చ్చారు . ఆ త‌రువాత ఎర్ణాకులం స్టేష‌న్ లో కుక్కును రైల్లో అనుమ‌తించ‌లేదు. టీసీ విష‌యం స్టేష‌న్ మేనేజ‌ర్ కు చెప్పి త‌మ‌వెంటే తీసుకువ‌చ్చారు. యాత్ర జ‌రిగిన నెల‌రోజులు ఆ కుక్క  నీళ్ళు పాలు త‌ప్ప మ‌రేమి తీసుకోలేద‌ని భ‌క్తులు చెప్పారు. అల‌సూర్  చేరుకున్న త‌రువాత ఆ కుక్క‌ను మురుగ‌న్ అనే వ్య‌క్తి తానే పెంచుకుంటాన‌ని ఇంటికి తీసుకువెళ్ళాపోయాడు. ఈ విష‌యం తెలిసిన వెట‌ర్న‌రి డాక్ట‌ర్  ఓక‌రు బ‌ల‌హీనంగా వున్న కుక్క‌కు ఉచితంగా వైద్యం చేస్తానంటూ మందులు ,ఆహారం తీసుకొచ్చి పెట్టారు. శున‌కాల గ్ర‌హ‌ణ శ‌క్తి , యజ‌మానుల‌పై భ‌క్తి, అంత‌ర్గ‌తంగా వాటికున్న శ‌క్తుల‌పై వాస్త‌వాలు కోకొల్ల‌లు  అటువంటిదే ఈ బైర‌వుడి అయ్య‌ప్ప యాత్ర.