శ్రీవారి సన్నిధిలో బ్రాందీ సేవనం..

727

తిరుమలలో నిఘా వైఫల్యం మరోసారి బయటపడింది. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో అపచారం జరుగుతూనే ఉన్నా అధికారుకు పట్టడంలేదు. మాడ వీధుల్లో మద్యం సేవిస్తూ ఓ వ్యక్తి కెమెరాకు చిక్కాడు. వరాహస్వామి ఆలయం సమీపంలో కల్వర్టులో కూర్చుని ఓ మందుబాబు ఈ పనిచేస్తున్నాడు. తిరుమలలో ఎక్కడ ఏం జరిగినా తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు ఉంటాయి. అయినా సమీపంలో ఉండే టీటీడీ సిబ్బంది కాని, విజిలెన్స్‌ అధికారులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇలా పదేపదే స్వామి వారి సన్నిధిలో అపచారం జరుగుతుండడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.