శ్రీ ఆంజనేయం..

521

గూడూరులో ఆంజనేయ స్వామి జండా మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ప్రతి ఏటా దసరాకు ముందు అమావాస్య రోజున ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల సందర్భంగా గూడూరు పుర వీధులను విద్యుత్తు దీపాలంకరణలతో సుందరంగా ముస్తాబు చేశారు. యువత నృత్యాలు డప్పు సవ్వడులు, బ్యాండు మేళాలు, బేతాళ నృత్యాలు ఆకట్టుకున్నాయి. తెనాలి బ్యాండు, కీలుగుర్రాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాయిద్య కళాకారులు కనువిందుగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. జండా మహోత్సవాల్లో యువత కేరింతలు, నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాల మధ్య ప్రధానవీధుల్లో ఆడుతూ పాడుతూ మహోత్సవ వేడుకలను చేపట్టారు. భారీ ఎత్తున బాణా సంచాలమోతల మధ్య జెండా గ్రామోత్సవం జరిగింది.