సభకు రారు.. జీతం తీసుకుంటారు

413

మన పార్లమెంట్ సభ్యుల్లో ప్రముఖులనుకున్నవాళ్లు కొంతమంది దౌర్భాగ్యులు. వాళ్లని రాజ్యసభకు నామినేట్ చేస్తే సభకు ఎగనామం పెట్టి డబ్బులు మాత్రం దర్జాగా తీసుకున్న దివాళాకోరు రాజకీయం మనది. ఒకాయన భారత రత్న సచిన్ టెండూల్కర్, ఇంకొకరు పద్మశ్రీ రేఖ. ఇద్దరూ రాజ్యసభ నామినేటెడ్ సభ్యులు. వీరి ఆరేళ్ల పదవీకాలంలో 397 రోజులు రాజ్యసభ జరగగా.. సచిన్ కేవలం 29రోజులు మాత్రమే సభకు హాజరయ్యారు. రేఖ అటెండెన్స్ కేవలం 18రోజులు మాత్రమే. ఈ సంబడానికి వీరు ప్రభుత్వం దగ్గరనుంచి తీసుకున్న జీతం ప్లస్ అలవెన్స్ లు ఎంతో తెలుసా? సచిన్ టెండూల్కర్ రాజ్యసభ సభ్యుడిగా అక్షరాలా 86లక్షల 23వేల 266 రూపాయలు తీసుకున్నాడు. రేఖ 99,59,178 రూపాయలు డ్రా చేసుకుంది. తన పదవీకాలం మొత్తంలో సచిన్ సభలో 22 ప్రశ్నలు అడగగా, రేఖ కనీసం నోరు మెదిపిన పాపాన పోలేదు. జనం సొమ్ముని జీతాల రూపంలో తీసుకుంటున్న ఈ నేతలు కాని నేతలు.. పదవీకాలంలో తమ కనీస బాధ్యతల్ని కూడా నిర్వర్తించడంలేదు. ఎంపీలుగా సౌకర్యాలు తీసుకోవడంలో ముందున్నారు కానీ, సభకు మాత్రం వెళ్లలేదు. జనానికి కాదు కదా, కనీసం సభకు కూడా మర్యాద ఇవ్వని వీళ్లని, వీళ్లని నామినేట్ చేసిన రాజకీయ పార్టీలను ఏమనాలో మీరే చెప్పండి.