సినీ గోవిందం..

1055

అందాల తారలు.. దేవదేవుడి ఆశీర్వాదం కోసం క్యూ కడుతున్నారు. ఇటీవల హీరోయిన్లు వరుసగా తిరుమల యాత్ర చేస్తున్నారు. ఆ లిస్ట్ లో అప్ కమింగ్ హీరోయిన్ మెహరీన్ కూడా చేరింది. వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. ఆలయ అధికారులు మెహరీన్ కి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం తీర్థప్రసాదాలను అందచేశారు. మెహరీన్‌ను చూసేందుకు ఆలయం వద్ద భక్తులు పోటీపడ్డారు. కృష్ణగాడి వీర ప్రేమ గాథతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈనె.. ఇటీవల మహానుభావుడు, రాజా దిగ్రేట్‌, కేరాఫ్‌ సూర్య, జవాన్‌ చిత్రాలతో వరుస విజయాలను దక్కించుకుంది.