సూళ్లూరుపేట కమిషనర్‌గానరేంద్రకుమార్‌…

157

సూళ్లూరుపేట పురపాలక సంఘం కమిషనర్‌గా ఎన్‌ నరేంద్రకుమార్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఉన్న కమిషనర్‌ వై.శ్రీనివాసరావును గుంటూరు డీఎంఏ కార్యాలయానికి బదిలీ చేస్తూ పురపాలకశాఖ డైరెక్టర్‌ నుంచి ఉత్తర్వులు అందినాయి. కొత్త కమిషనర్‌గా నియమితులైన నరేంద్రకుమార్‌ గతంలో వెంకటగిరి, గూడూరు పురపాలక సంఘాలు కమిషనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం నెల్లూరు నగరపాలక సంస్థలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ బదిలీపై సూళ్లూరుపేట కమిషనర్‌గా నియమితులయ్యారు.