సెన్సిబుల్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నంకు గుండెపోటు

377

సెన్సిబుల్ డైరెక్ట‌ర్ మణిరత్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయనకు గుండెపోటు రావ‌డంతో భార్య సుహాసిని, కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన చెన్నైలోని థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మణిరత్నం త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.