సోమశిలకు అంతకంతకూ పెరుగుతున్నవరద..

841

కడప జిల్లా వర్షాలతో నెల్లూరు సోమశిల జలాశయానికి అంతకంతకూ వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 47 టీఎంసీలకు చేరుకుంది. 314 అడుగుల మేర జలాశయంలో నీరు నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 31,858 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5వేల క్యూసెక్కులు. డెల్టాకు తాగునీటికోసం 5వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు.