సోమశిలనుంచి ఆగిన ప్రవాహం..

742

జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమశిల రిజర్వాయర్ నుంచి డెల్టాకు తాత్కాలికంగా నీటిని నిలిపివేశారు. ఐఏబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈనెల 2న సోమశిల రిజర్వాయర్ నుంచి తొలిపంటకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఇప్పటి వరకూ 4వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయితే జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ నీటిని ఆపివేశారు. ప్రస్తుతం సోమశిలలో 50.753 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 8వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. తెలుగుగంగ కాల్వ ద్వారా 4వేల క్యూసెక్కుల నీటిని కండలేరు జలాశయానికి సరఫరా చేస్తున్నారు. కండలేరు జలాశయంలో ప్రస్తుతం 16.77 టీఎంసీల నీరు నిల్వ ఉంది.