సోమిరెడ్డిపై విచారణ జరగాల్సిందే..

1121

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అతని కుమారుడి డొల్ల కంపెనీలపై ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కి ఫిర్యాదు చేశానని అన్నారు వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఈడీ విచారణ జరపాలని కోరామని మరోసారి ఈడీకి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. లోకల్ పోలీసులు తాను చేసిన ఆరోపణలపై విచారణ జరపకుండా నీరుగార్చారని మండిపడ్డారు.