హేమాక్షర్ కు రూరల్ ఎమ్మెల్యే అభినందనలు

330

నెల్లూరు నగరంలోని సరస్వతి నగర్ ప్రాంతానికి చెందిన హేమాక్షర్ ఈ ఏడాది క్యాట్ పరీక్షల్లో 99.94 శాతం మార్కులు సాధించి రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హేమాక్షర్ ను ప్రత్యేకంగా అభినందించారు. తన కెరీర్ లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.