హైవేపై ప్రమాదం..

2710

నెల్లూరు జిల్లా హైవేపై మరో పెద్ద ప్రమాదం జరిగింది. నాయుడుపేట సమీపంలోని పెళ్లకూరు దగ్గర లారీ బస్సు ఢీకొన్నాయి. కాసేపట్లో బస్సు గమ్యస్థానానికి చేరుకుంటుందనగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో బస్సులో ఉన్నవాళ్లు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. లేచి చూసే సరికి చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉన్నా ప్రాణాపాయం సంభవించలేదు. క్షతగాత్రుల్ని నాయుడుపేట ఆస్పత్రికి తరలించారు.