4నెలల నరకం..

3972

సైదాపురం ఎస్సై 4నెలలుగా తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, అతడి సెక్స్ కోరికలకు తాను లొంగలేదని తన భర్తతో సహా తన బంధువులందరిపై తప్పుడు కేసులు పెట్టి జైలుపాలు చేశాడని ఊటుకూరు గ్రామ సర్పంచ్ పద్మజ ఆవేదన వ్యక్తం చేసింది. ఒక దశలో తన భర్త ఇంట్లో లేని సమయంలో ఇంటికొచ్చి ఇంట్లో ఉన్న ఒక బంధువుని బయటకు పంపించి, తన కొడుకుని కూడా బయటకు తరిమేసి, తనను పట్టుకునేందుకు ప్రయత్నించాడని తాను అతడినుంచి బయటపడి వీధిలోకి వచ్చేశానని చెప్పింది. తరచూ తనకు ఫోన్ చేసి లొంగిపోవాల్సిందిగా కోరేవాడని ఎస్సై బాధ తట్టుకోలేక మండల కేంద్రంలో సర్పంచ్ ల సమావేశానికి కూడా హాజరు కాలేక పోయేదానిని అని ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు తన కొడుకు సాయంతో ఫోన్లో కాల్ రికార్డర్ పెట్టుకుని ఎస్సైతో మాట్లాడి ఎస్పీకి ఫిర్యాదు చేశానని చెప్పింది. ఎస్సై సెక్స్ కోరికను తాను తీర్చలేదన్న ఉద్దేశంతోనే తన భర్త బంధువులపై కేసులు పెట్టి జైలుకి పంపడం, సివిల్ కేసుల్లో తలదూర్చి ఈ దారుణానికి పాల్పడటంతో విధిలేని పరిస్థితుల్లో తాను ఈ పనిచేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.