45టీఎంసీలకు చేరిన నీటిమట్టం..

1635

కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు నెల్లూరు జిల్లా రైతాంగానికి వరంగా మారాయి. భారీ వర్షాలతో పెన్నమ్మ ఉరకలెత్తుతూ సోమశిల జలాశయం వైపు వడివడిగా అడుగులేస్తోంది. రోజురోజుకీ ఇన్ ఫ్లో భారీగా పెరగడంతో సోమశిల రిజర్వాయర్ నీటి నిల్వ ఊహించని రీతిలో 45 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 23,000 క్యూసెక్కులుగా నమోదయింది. గతేడాది ఇదే సీజన్లో సోమశిలలో 31 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ ఏడాది ఏకంగా 14 టీఎంసీల నిల్వ పెరిగింది, మరింత పెరిగే అవకాశముంది. దీంతో రైతుల మోముల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.