45 రోజుల తర్వాత మీరే ఒప్పుకుంటారు

1891

అధిక బరువుతో బాధపడుతున్నారా.. ఎంత ట్రై చేస్తున్నా బరువు తగ్గటం లేదా… అయితే ఇది మీకోసమే.. ఇందుకోసం మీరు వేలకు వేలు ఖర్చు చెయ్యాల్సిన అవసరం లేదు. ఫిట్ నెస్ సెంటర్లకు వెళ్లాల్సిన పనీ లేదు. జస్ట్ మీ వంటింట్లోకి వెళితే చాలు..

రాత్రి వేడి నీళ్లలో ఈ పొడి కలుపుకుని తాగితే 3 నెలల్లో శరీరంలో వేస్ట్ కొవ్వు మొత్తం కరిగి, బరువు తగ్గుతారు..

కావల్సిన పదార్ధాలు :

* 250 గ్రాముల మెంతులు
* 100 గ్రాముల వాము
* 50 గ్రాముల నల్ల జీలకర్ర

తయారీ విధానం:

ముందుగా 3 పదార్థాలను రాళ్లు, మట్టి వంటివి లేకుండా శుభ్రం చేసుకోవాలి. వేరు వేరుగా పెనం పైన వేసి కొద్దిగా వేడి చేయాలి. మెంతులు, వాము, నల్ల జిలకర కలిపి పొడిగా చేసుకోవాలి. గాలి పోయే వీలులేని సీసాలో నిల్వ చేసుకోవాలి.

వాడే విధానం :

* రోజూ రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి నీళ్లలో 1 స్పూన్ చూర్ణం (పొడి)ని కలిపి తాగాలి.
* ఆ తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోరాదు.
* రోజూ ఈ పొడిని తాగితే శరీరంలో పేరుకున్న విష పదార్థాలు మల, మూత్ర, చెమటల ద్వారా బయటకు వస్తాయి.
* క్రమం తప్పకుండా 40-50 రోజులు తీసుకున్న తర్వాత గొప్ప ఫలితాలు అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. 3నెలలు వాడితే మీ ఆరోగ్యానికి ఇక తిరుగు
ఉండదు.
* ఈ పొడి వాడిన తర్వాత శరీరంలోని అదనపు కొవ్వు మొత్తం కరిగిపోతుంది.
* రక్తం శుభ్రపడుతుంది. శరీరంలో మంచి రక్తం ప్రవహిస్తుంది.
* బాడీపై ఉన్న ముడతలుపోయి. శరీరంలో యవ్వనత్వం సంతరించుకుంటుంది.
* శరీరం బలంగా, చురుకుగా, ప్రకాశవంతంగా తయారవుతుంది.
* కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి.
* ఎముకలు బలంగా తయారవుతాయి.
* కంటి చూపు మెరుగవుతుంది.
* జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.
* మల బద్దకం శాశ్వతంగా దూరమవుతుంది. మోషన్ సాఫీగా అవుతుంది.
* రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది.
* దీర్ఘ కాలిక దగ్గు పోతుంది.
* గుండె పనితీరు మెరుగవుతుంది.
* మెదడు చురుగ్గా మారుతుంది. వినికిడి పెరుగుతుంది.
* రోజువారీ పనుల్లో చెలాకీగా పాల్గొంటారు.
* గతంలో తీసుకున్న ఇంగ్లిష్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ను ఇది క్లియర్ చేస్తుంది.
* పళ్లు చిగుళ్లు బలంగా, ఆరోగ్యంగా మారతాయి.
* షుగర్ నియంత్రణలోకి వస్తుంది.

ఇది తాగితే అధిక బరువు మొత్తం తగ్గుతుందా.. అనే డౌట్ వద్దు.. ఈ డ్రింక్ తాగుతూ, కాస్త జంక్ ఫుడ్ కు దూరంగా వుండండి. శరీరానికి తగిన వ్యాయాయం కూడా తప్పనిసరి. 40 నుంచి 45 రోజుల తర్వాత మీరే ఒప్పుకుంటారు.