నేను చెప్పను.. నేను చెప్పను

67

పాకిస్తాన్ పై మిగ్ -21 యుద్ధవిమానంతో దాడికి పోయిన అభినందన్ వర్థమాన్ గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి. సైనికుడంటే ఎలా ఉండాలో అభినందన్ చెప్పి చూపించారు. పాకిస్తాన్ సైనికులకు ఖైదీగా దొరికిన తర్వాత అభినందన్ ను పాకిస్తాన్ ఆర్మీ కొన్ని ప్రశ్నలు అడిగింది. తనను పాకిస్తాన్ ఆర్మీ మర్యాదగానే చూసిందని, అభినందన్ చెప్పారు. పాకిస్తాన్ సరిహద్దుల్లోకి నువ్వు ఎందుకొచ్చావంటే.. సారీ నేను చెప్పను అన్నారు. మీరు ఏ యుద్ధవిమానంలో దాడికి వచ్చారంటే.. సారీ నేను చెప్పను అన్నారు. యుద్ధసమయాల్లో పట్టుబడ్డ ఖైదీలు తమను శత్రుదేశం ఎన్ని ప్రశ్నలు అడిగినా, అవి యుద్ధరంగానికి సంబంధించినవి అయితే చెప్పరు. ఆ నీతిని ఆయన కచ్చితంగా పాటించారు. తనకిచ్చిన టీ బాగుందని చెప్పారు. తాను దక్షిణ భారత దేశం నుంచి వచ్చినవాడినని కూడా చెప్పారు. తనకు పెళ్లి అయిందని కూడా ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.