ఆఫీస్ లోనే అవినీతి మేత..

163

నీరు చెట్టు పనులకు బిల్లులు చెల్లించేందుకు 3 నెలల నుంచి కాంట్రాక్టర్ ను ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నాడు ఏఈ వెంకట్రావు. లంచం ఇవ్వకపోతే సర్టిఫికెట్ ఇవ్వనని తెగేసి చెప్పాడు. చివరకు కాంట్రాక్టర్ పెంచలయ్య ఏసీబీని ఆశ్రయించి వెంకట్రావు అవినీతి బాగోతం బైటపెట్టాడు.
ఆత్మకూరు నియోజకవర్గం యర్లపాడు పంచాయతీ పరిధిలో కల్వర్ట్ పనులకు సంబంధించి గుర్రం పెంచలయ్య అనే వ్యక్తి నుంచి ఏఈ వెంకట్రావు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పనులు పూర్తి కాగా డబ్బులు మంజూరుకోసం ఇచ్చే క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం 3 నెలల నుంచి పెంచలయ్యను ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నాడు. సర్టిఫికెట్ ఇవ్వాలంటే పర్సంటేజీ ముట్టజెప్పాలన్నాడు. చివరకు 56వేలకు బేరం తెగ్గొట్టాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని పెంచలయ్య ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. అధికారులు మాటు వేసి ఈరోజు లంచం తీసుకుంటుండగా వెంకట్రావును పట్టుకున్నారు.