కన్నబాబు గాయానికి చికిత్స అవసరం..

153

ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఇంచార్జి కన్నబాబు ఇంచార్జి పదవి రాలేదన్న బాధతో ఉన్నారని, ఈ విషయంలో ఆయన మనసు గాయపడిందని ఆదాల అన్నారు. గాయపడ్డ మనసు, కుదుటపడాలంటే ఆ గాయం మానాలంటే నెలా రెండు నెలలు పడుతుందని, అయితే ఈలోపల ఆ గాయాలు మానకుండా ఉండేందుకు కొంతమంది కారం పూస్తున్నారని వ్యాఖ్యానించారు. గాయానికి మందులేసుకుంటే తగ్గిపోతుందని, కానీ కారం పూసే వాళ్ల వల్ల ఇబ్బందిగా ఉందని అన్నారు. కన్నబాబుతో తనకు ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. బొల్లినేని కృష్ణయ్యతో కూడా కన్నబాబుకి స్పర్థలు లేవని అన్నారు.