ఆనం జయ తిరగబడ్డారు..

75

నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో తిరుబాటు మొదలైంది. నెల్లూరు రూరల్ లో పార్టీ కీలకనేత ఆనం జయకుమార్ రెడ్డి తిరుగబడ్డారు. రూరల్ టీడీపీ టిక్కెట్ తనకు ఇస్తానని ఇంతకాలం మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూరల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను తన భుజస్కంధాలపై పెట్టి ఇప్పుడు తన భుజంపైనే తుపాకీ పెట్టి తనను కాల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా రూరల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్, ప్రతి గ్రామం తిరిగి పార్టీని పటిష్టం చేశానన్నారు. ఆ విశ్వాసం కృతజ్ఞత కూడా లేకుండా నిర్ధాక్షిణ్యంగా తనను అవమానించారని తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నమొన్నటి వరకు మంత్రి నారాయణ, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ రూరల్ టిక్కెట్ తనకే ఇస్తామని చెప్పారని, అయితే ఇప్పుడు అకస్మాత్తుగా ఫ్లేటు ఫిరాయించి, ఆదాలను అభ్యర్ధిగా ప్రకటించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు.