ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాకు ఆదర్శనీయం..

99

ప్రజలతో మమేకమై, ప్రజలతో కలిసిపోయిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమలాంటి ఎంతోమందికి స్ఫూర్తి దాయకమని కార్పోరేటర్ ఆనం రంగమయూర్ రెడ్డి అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ వేలకోట్లు వున్న బడాబాబులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి శ్రీధర్ రెడ్డిని ఓడించాలని ప్రయత్నిస్తున్నారని, కానీ ప్రజలు మాత్రం వారిని తిరస్కరిస్తారని అన్నారు. ప్రజలలో ఒకడిగా కలిసిపోయిన ఎమ్మెల్యేను వచ్చే ఎన్నికల్లో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.