బైక్ యాక్సిడెంట్ లో ఎక్సైజ్ సీఐకి తీవ్ర గాయాలు..

397

బైక్ ప్రమాదంలో ఆత్మకూరు ఎక్సైజ్ సీఐ ఎం.బాలకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను మెరుగైన వైద్యంకోసం నెల్లూరుకు తరలించారు. ఏఎస్ పేటలో అక్రమ మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో హుటాహుటిన అక్కడకు బయలుదేరారు సీఐ బాలకృష్ణ. మార్గమధ్యంలో ముస్తాపురం మలుపు వద్ద స్కూటర్ అదుపుతప్పడంతో ఆయన కిందపడిపోయారు. రక్తగాయాల పాలైన ఆయనను నెల్లూరుకు తరలించారు.