బాలయ్య నోటీసులు జారీ చేస్తామన్న రిటర్నింగ్ ఆఫీసర్

72

ప్రచారంలో బూతులు తిడుతూ, బాంబులేస్తానంటూ.. వివాదాలకు కేంద్రంగా మారిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. మరోసారి చిక్కుల్లో పడ్డారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద హల్ చల్ చేశారు. ఆయనతోపాటు టీడీపీ నేతలు కూడా కేంద్రం వద్దకు వచ్చారు. దీనిపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యర్థి పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్దకు ఎలా వస్తారంటూ వైసీపీ నాయకులు ధర్నా చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద బాలకృష్ణ ప్రచారం నిర్వహించారని ఆరోపించారు. ఉద్యోగులతో ఫొటోలు దిగారని, పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకోవడానికి ప్రయత్నించలేదని అన్నారు. దీనిపై స్పందించిన హిందూపురం రిటర్నింగ్‌ అధికారి గుణభూషణ్‌రెడ్డి బాలకృష్ణకు నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు.