ఆదాల ఓ ఊసరవెల్లి.. – బీదా ధ్వజం..

76

గుడ్డలు మార్చుకున్నట్టుగా, చెప్పులు మార్చుకున్నట్టుగా కొంతమంది నాయకులు పార్టీలు మారారని ఆదాల ప్రభాకర్ రెడ్డిపై ధ్వజమెత్తారు నెల్లూరు లోక్ సభ టీడీపీ అభ్యర్థి బీదా మస్తాన్ రావు. ఊసరవెల్లి రాజకీయాలను ప్రజలు హర్షించరని అన్నారు. నెల్లూరు కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేసిన ఆయన, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకోసం తాను కష్టపడ్డానని, సొంత నిధులతో కావలి ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. నెల్లూరు ఎంపీగా గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో పదికి పది నియోజకవర్గాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.