వైఎస్సార్ మాటలు చెప్పారు..

80

వైఎస్సార్ మాటలు చెప్పారు..
చంద్రబాబు చేతల్లో చూపించారు..
నెల్లూరు జిల్లాలో ఎయిర్ పోర్ట్ గురించి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఐదేళ్లపాటు మాటలు చెప్పారని, చంద్రబాబు నాయుడు చేతల ముఖ్యమంత్రి అని అందుకే ఆయన హయాంలో దామవరం ఎయిర్ పోర్ట్ కు శంకుస్థాపన జరిగిందని చెప్పారు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీదా రవిచంద్ర. 2020కల్లా ఎయిర్ పోర్ట్ పూర్తి చేస్తామని అన్నారు. సామాజిక పింఛన్లను
200నుంచి వెయ్యికి పెంచింది నెల్లూరులోనే అని, వెయ్యి నుంచి 2వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కూడా నెల్లూరు జిల్లాలోనే కావడం మన జిల్లా అదృష్టం అని అన్నారాయన. గతంలో 40లక్షల పింఛన్లు ఉండగా, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం 55లక్షల మందికి పింఛన్లు అందిస్తోందని అన్నారు.