వేదాయపాలెం కేంద్రంగా బెట్టింగ్ మాఫియా..

140

ప్లేస్టోర్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను నెల్లూరు 5వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి లక్షా 50 వేల నగదు, మూడు సెల్ ఫ్లోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ నరసింహులు మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. వేదాయపాలెంలోని ధనలక్ష్మీ ఫ్యాన్సీ స్టోరులో బెట్టింగ్ నడుస్తోందన్న సమాచారం మేరకు రైడ్ చేసి, నిందితులను అరెస్టు చేశామన్నారు. నిందితులు చంద్రమోళినగర్, భక్సవత్సలనగర్ కు చెందినవారిగా గుర్తించామన్నారు. జిల్లాలో, నగరంలో బెట్టింగులు నిర్వహిస్తే ఉక్కుపాదం మోపుతామన్నారు.