నెల్లూరు బైక్ దొంగలు అరెస్ట్..

148

ఈ బైక్ లన్నీ చూసి ఇదేదో టూవీలర్ షోరూమ్ అనుకుంటున్నారా కాదు. బైక్ దొంగలనుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నవి. ఒకటి కాదు, రెండు కాదు.. 41 బైకుల్ని ఈ దొంగల ముఠానుంచి పోలీసులు రికవరీ చేశారు. చెడు వ్యసనాలకు బానిసైన ఇద్దరు యువకులు దొంగతనాలకు అలవాటు పడ్డారు . విడవలూరుకు చెందిన ముక్కాల రమేష్, సుధాకర్ లు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బైక్ దొంగతనాలు చేసేవారు ,బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు . రంగంలోకి పోలీసులు గాలింపులు చేపట్టి ఇద్దరు దొంగలను పట్టుకున్నారు . వారి వద్ద నుంచి 41 మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు . వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.