నెల్లూరు కలెక్టరేట్ వద్ద హైటెన్షన్..

83

నెల్లూరు కలెక్టరేట్ వద్ద హైటెన్షన్..
పోలీసులతో బీజేపీ నాయకుల వాగ్వాదం..
అధికారపక్షానికి పోలీసులు కొమ్ముకాస్తున్నారంటూ బీజేపీ నేతలు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. నామినేషన్ల సందర్భంగా టీడీపీ నేతల్ని 50మందిని కలెక్టరేట్ లోకి అనుమతించిన పోలీసులు తమని మాత్రం ఎందుకు లోపలికి పోనివ్వడంలేదని వాగ్వాదానికి దిగారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బీజేపీ సురేష్ రెడ్డి నామినేషన్ వేయడానికి కలెక్టరేట్ కి వెళ్లగా కొంతమందినే పోలీసులు లోపలికి అనుమతించారు. మిగతా వారిని బయటే నిలువరించారు. దీంతో సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేలపై పడుకుని నిరసన వ్యక్తం చేయడంతో కాసేపు గందరగోళం నెలకొంది.