శివలింగం ప్రతిష్టించడం చేతకాని దద్దమ్మలు టీడీపీ నేతలు..

113

హిందువల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి. నెల్లూరు చెరువులో శివలింగం ప్రతిష్టాపనపై టీడీపీ వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. శివలింగాన్ని ప్రతిష్టాస్తామని చెప్పి కొంతమందికి భయపడి వెనక్కు తగ్గారని అన్నారు. మత విశ్వాసాలతో ఆడుకుంటూ ఓట్ల లబ్ది పొందేందుకు టిడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు సురేష్ రెడ్డి. హిందువుల మనోభావలని కాపాడేందుకు అరెస్టులకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు.