ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిని నేనే.. బొల్లినేని కృష్ణయ్య

292

వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నానంటూ స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య. ఆత్మకూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని ప్రకటించారు. టీడీపీ అధిష్టానం తనమీద నమ్మకంతో పోటీ చేయాలని కోరిందని ఈ మేరకు ఆత్మకూరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.1999లో ఆత్మకూరు నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణయ్య, 2004లో బీజేపీ టికెట్ పై పోటీచేసి పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీ యాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం టీడీపీ తరపున ఆత్మకూరు బరిలో నిలబడబోతున్నారు.