ప్రియాంక నిశ్చితార్థ వేడుక..

548

బాలీవుడ్‌ తార ప్రియాంకా చోప్రా నిశ్చితార్థం ఆమె ప్రియుడు, హాలీవుడ్‌ గాయకుడు నిక్‌ జొనాస్‌తో జరిగింది. నిన్న నిశ్చితార్థం జరగగా, ఈరోజు ప్రియాంక నివాసంలో పూజలు (రోకా) నిర్వహించారు. ఈ శుభకార్యంలో ప్రియాంక పసుపు వర్ణం దుస్తుల్లో మెరిశారు. నిక్‌ కుర్తా పైజామా ధరించారు. ఇద్దరు కలిసి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రియాంక సోదరి పరిణీతి చోప్రా పూజలో పాల్గొన్నారు. ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్ లో పార్టీ కూడా అరేంజ్ చేశారు. నిశ్చితార్థం పార్టీ కోసం ప్రియాంక ఇప్పటికే హోటల్‌లోని 200 గదుల్ని బుక్‌ చేయించారని సమాచారం. ఈ పార్టీ కోసం నిక్‌ స్నేహితులు విదేశాల నుంచి రాబోతున్నారట. బాలీవుడ్‌ సినీ ప్రముఖులు రణ్‌వీర్‌ సింగ్‌, పరిణీతి చోప్రా, మనీష్‌ మల్హోత్రా, సోఫీ చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు నిక్‌ తల్లిదండ్రులు గురువారం రాత్రి ముంబయి చేరుకున్నారు.