నన్ను వాడుకుని వదిలేశారు.. వైసీపీకి బొమ్మిరెడ్డి రాజీనామా

172

మాటతప్పను మడమ తిప్పను అనే జగన్.. ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు అని ప్రశ్నించారు జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి. వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జిగా ఆనం రామనారాయణ రెడ్డిని పార్టీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు బొమ్మిరెడ్డి ప్రకటించారు. ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా వైసీపీలో కొనసాగలేనని జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి స్పష్టం చేశారు. ఇండిపెండెంట్ గానే ఉంటానని చెప్పారు. ఏ పార్టీ వారయినా పిలిస్తే ఆలోచిస్తానని చెప్పారు. వెంకటగిరి నియోజకవర్గానికి తనను ఇంచార్జిగా నియమించి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని గతంలో హామీ ఇచ్చి, ఇప్పుడు రామనారాయణ రెడ్డి వచ్చిన తర్వాత తనను పక్కన పెట్టడం బాధిస్తోందని అన్నారు. తనతో మాట్లాడకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రామనారాయణ రెడ్డిలా 50కోట్లు నువ్వు పెట్టగలవా అని జగన్ తనను ప్రశ్నించారని అన్నారు. జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర వెంకటగిరి నియోజకవర్గంలో తన ఆధ్వర్యంలోనే జరిగిందని, పాదయాత్రలో వెంకటగిరిలో పార్టీ బాగుందని ప్రశంసించి తనను పక్కన పెట్టడం ఎంతమాత్రం న్యాయమని ప్రశ్నించారు.