శ్రీ సిటీలో క్యాడ్‌బరీ చాక్లెట్ యూనిట్‌ – నేడే ప్రారంభం

724

శ్రీసిటీ, ఏప్రిల్ 25, 2016 : ప్రముఖ చాక్లెట్ల తయారీ సంస్థ మోండోలెజ్‌ (క్యాడ్‌బరీ) తమ నూతన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో, ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు చేతుల మీద ప్రారంభం కానుంది. ప్రభుత్వం అనుమతి పొందిన రెండేళ్లలోపే ఈ యూనిట్ రూపుదిద్దుకుని, పూర్తికావడం విశేషం. క్యాడ్‌బరీగా ప్రసిద్ధమైన ఈ సంస్థను ప్రస్తుతం మోండోలెజ్‌ ఇండియాగా పిలుస్తున్నారు. కాగా ఈ ప్లాంటు నిర్మాణ వ్యయం సుమారు వెయ్యికోట్లు. ప్రస్తుతం తొలిదశ పూర్తి చేసుకున్న ఈ ప్లాంటులో మరో మూడు దశలలో నిర్మాణ పనులు పూర్తికావలసి వున్నాయి. 2020 నాటికి పూర్తిస్థాయిలో మొత్తం యూనిట్ అందుబాటులోకి రానుంది. ఏడాదికి 2.5 లక్షల టన్నుల చాక్లెట్‌ ప్రొడక్షన్ కెపాసిటీని కలిగివున్న ఈ ప్లాంట్‌ నిర్వహణ నిమిత్తం 0.6 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ ఎనర్జీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఇప్పటికే 300 కు పైగా గ్రామీణులకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించింది.