12లక్షల62వేల నగదు.. సీజ్ చేసిన పోలీసులు..

63

12లక్షల62వేల నగదు.. సీజ్ చేసిన పోలీసులు..
ఎన్నికల వేళ ముమ్మరంగా తనిఖీలు..
ఎన్నికలు సమీపిస్తుండడంతో నెల్లూరు జిల్లా పోలీసులు, విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ శాఖలు విస్త్రృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. తనిఖీల్లో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద పల్లెవెలుగు బస్సులో తరలిస్తున్న 12 లక్షల 92 వేల నగదును గుర్తించారు. దీనికి సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో బుచ్చి పోలీసులకు అప్పగించి నగదును సీజ్ చేశారు. నగదును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.