సెలబ్రిటీ ఆయా..

3074

బాలీవుడ్‌లోని పాపులర్‌ స్టార్‌ కిడ్స్‌లో తైమూర్‌ అలీ ఖాన్‌ ఒకడు. పటౌడీ దంపతులు సైఫ్‌ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌లకు జన్మించిన తైమూర్‌ ఎక్కడ కనిపించినా విశేషమే. క్యూట్ గా కనిపించే తైమూర్ ఫొటోలు తరచూ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుంటాయి. కేవలం తైమూర్ ఒక్కడే కాదు, ఆ పిల్లవాడిని పెంచే ఆయా కూడా ఇప్పుడు సెలబ్రిటీల లిస్ట్ లో చేరింది. ఆమె తీసుకునే జీతమే దానికి కారణం. తైమూర్ సంరక్షణ చూసుకునే ఆయాకి ఏడాదికి కోటీ 8లక్షలు జీతం. అంటే నెలకు లక్షన్నర రూపాయలన్నమాట. అది కూడా కేవలం 8 గంటల షిఫ్ట్ మాత్రమే. పనివేళలు దాటితే జీతం ప్లస్ ఇంటెన్సివ్స్ అదనం. కోటీ 75లక్షల వరకు ఇస్తారు. తైమూర్ బాగోగులు చూసుకునే ఆయా పేరు నైనీ, అసలు పేరు సావిత్రి. నర్సింగ్ లో పీజీ చేసిన ఈమెను ఓ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పనిలో కుదుర్చుకున్నారు. ఆమెకు అన్ని వైద్య పరీక్షలు చేయించి, కుటుంబ నేపథ్యం గురించి ఆరా తీసి మరీ ఆమెకు ఉద్యోగం ఇచ్చారు. ఏడేళ్లపాటు పిల్లవాడి బాగోగులు చూసుకునేట్టు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. ప్రస్తుతం తైమూర్ కి 21 నెలలు. అంటే ఈ అగ్రిమెంట్ ముగిసేలోపే ఆమె కోటీశ్వరురాలవుతుంది. అంతేకాదు బాబుని బైట తిప్పడంకోసం ఆమెకు ప్రత్యేక కారు కూడా కేటాయించారు. సైఫ్, కరీనా విదేశాలకు విహారం వెళ్లేటప్పుడు బాబుని వెంట తీసుకెళ్తే ఆయాని కూడా తమతోపాటే తీసుకెళ్తారు. అలా దేశం దాటి వెళ్లాలన్నా కూడా ఆమెకు ఎక్కువ మొత్తం ఇస్తారట
పటౌడీ కుటుంబ వారసుడు కావడంతో.. తైమూర్ విషయంలో చిన్నప్పటి నుంచీ వారి తల్లిదండ్రులు ఆ హోదాకు తగ్గట్టే అన్నీ చేస్తూ వచ్చారు. పిల్లవాడి మొదటి పుట్టినరోజున దీవించిన హిజ్రాలకు ఒక్కొకరికి 51వేల రూపాయలు బహుమతిగా ఇచ్చారు. ఇక వాడి హెయిర్ స్టైల్, డ్రస్సింగ్ స్టైల్ చూసుకోడానికి కూడా వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. మొత్తానికి బుల్లి రాజుని చూసుకునే ఆయా కూడా సెలబ్రిటీల లిస్ట్ లో చేరింది.