గొలుసు దొంగలు ఈ తండ్రీ కొడుకులు..

99

పగలు బార్బర్ షాప్ లో జుట్టు కత్తిరిస్తారు, రాత్రయితే ఈ తండ్రీ కొడుకులు దొంగలుగా మారిపోతారు. మహిళల్ని టార్గెట్ చేసి మెడలోంచి చైన్లు కత్తిరిస్తారు. నెల్లూరు నగరంలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న తండ్రీ కొడుకుల్ని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంగం మండలం జండా దిబ్బకు చెందిన రాచపూడి మస్తానయ్య తన కొడుకుతో కలసి నెల్లూరుకు వచ్చి గొలుసు దొంగతనాలు చేస్తున్నాడు. రాత్రి పూట ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసి వీరిద్దరూ బైక్ పై వెంబడించి గొలుసు తెంచుకుని పారిపోతుంటారు. కటింగ్ షాపులో పనిచేసే మస్తానయ్య.. పగలు పనిచేస్తూ రాత్రి పూట గొలుసు దొంగతనాలు చేస్తున్నాడు. మైనర్ కొడుకుని కూడా తనతోపాటు దొంగతనాలకు తీసుకుపోతుంటాడు. అడ్డొస్తే హతమార్చడానికి సుత్తి, రాడ్డు, కత్తి కూడా వీరు రెడీగా పెట్టుకుంటారు. వీరి వద్దనుంచి 1.70లక్షల విలువచేసే నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మురళీకృష్ణ ఈ కేసు వివరాలు తెలియజేశారు.