రోడ్డెక్కిన చంద్రబాబు..

22

రోడ్డెక్కిన చంద్రబాబు..
ఐటీ దాడులకు వ్యతిరేకంగా నిరసన..
టీడీపీ నేతల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశ్యపూర్వకంగా కేంద్రంలోని బీజేపీ, వైసీపీ నేతలు, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమ్మక్కై ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఐటీ దాడులకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రం వద్దనున్న అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించిన సీఎం.. ఐటీ దాడులపై ఆందోళనకు దిగారు. ఈ నిరసనలో ఎంపీ కేశినేని నానితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ – వైఎస్ జగన్ – కేసీఆర్ బొమ్మలను నల్ల బెలూన్లకు కట్టి నిరసన తెలిపారు చంద్రబాబు. అనంతరం వాటిని గాలిలోకి ఎగురవేశారు.